Reason For Kurnool Racha Audio Launch Cancelled
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియోని కర్నూల్ లో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని విధంగా ఆ ఆడియోని..హైదరాబాద్ లో నే శిల్పకళా వేదిక మీదే చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్చి 9 న జరిగే ఈ ఆడియో పంక్షన్ కి పరిశ్రమలోని పెద్ద పెద్ద వాళ్లందరనీ ఆహ్వానిస్తున్నారు. దాంతో వారికి సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాసం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కర్నూలు పోలీసులు తాము అంత పెద్ద పంక్షన్ కి సెక్యూరిటీ ఇవ్వలేమని తేల్చేసారని సమాచారం. ఈ నేపధ్యంలో తప్పనిసరిగా హైదరాబాద్ లోనే పంక్షన్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కర్నూలు జనాలని చాలా నిరాశ పరిచింది.
ఇక రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై ‘రచ్చ’ చిత్రాన్ని రూపొందిస్తుననారు. మణిశర్మ సంగీతం సంగీతం అందిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రచ్చ చిత్రాన్ని మార్చి చివరి వారంలో గాని ఏప్రియల్ నెలలోగానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని చేస్తున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం ఖర్చు రూ. 29 కోట్లకు చేరువైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.
