నందమూరి - మెగా ఫ్యామిలీల మధ్య సమరం!
Summer war between Mega and Nandamuri families.
తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న నాలుగైదు కుటుంబాలో మెగా స్టార్ కుటుంబం, నందమూరి కుటుంబాలు తమదైన రీతిలో పరిశ్రమపై ఆదిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన హీరోలు ప్రతి సందర్భంలోనూ పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ సమ్మర్‌లో ఈ రెండు కుటుంబాల మధ్య ఆసక్తికర సమరం మొదలు కానుంది. ఈ కుటుంబాలకు చెందిన నందమరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు నటించి భారీ సినిమాలు కాస్త అటు ఇటుగా ఒకేసారి సమ్మర్లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ చిత్రం సమ్మర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. బాలయ్య ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మీ రాయ్, సలోని హీరోయిన్లు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే సమ్మర్లో తన ‘దమ్ము’ ఏమిటో చూపించడానికి వస్తున్నాడు. దమ్ము చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా... త్రిష, కార్తీక హీరోయిన్లు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మల్టీ గెటపుల్లో కనిపించబోతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్రం కూడా ఇదే సమ్మర్లో విడుదల కాబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎన్వి ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చెర్రీ సరసన తమన్నా నటిస్తోంది.
ఈ రెండు కుటుంబాలకు చెందని నలుగురు హీరోలు ఒకే సారి బరిలోకి దిగుతుండంతో ...ఈ సమ్మర్ సమరంలో గెలుపు ఎవరిది? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
