Trisha Taking Rest at Home
త్రిషకి ఈ మధ్య అసలు ఆరోగ్యం బాగోలేదు. వైద్యులు ఓ వారం విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో త్రిష ఇంట్లోనే గడుపుతోంది. అయితే తాను హ్యాపీగానే ఉన్నానంటోంది త్రిష. ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... ''ఎంత పని ఒత్తిడిలో ఉన్నా... కుటుంబ సభ్యులతో గడపడం మరిచిపోను. కొన్నిసార్లు మాత్రం వీలుపడదు. అప్పుడు బాధేస్తుంటుంది. అనారోగ్యం పుణ్యమాని కుటుంబ సభ్యుల మధ్య ఇప్పుడు హాయిగా గడుపుతున్నా. పనిలో పనిగా నాకు ఇష్టమైన పెంపుడు కుక్కలతో కూడా ఆడుకుంటున్నా. అనారోగ్యం ఒక్కోసారి ఇలా మంచే చేస్తుంది అనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చింది త్రిష. అలాగే
''జీవితంలో ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా... ప్రేమ, ఆప్యాయతలకు మాత్రం ఏదీ సాటి రాదు. కుటుంబ సభ్యులతో గడిపినప్పుడు కలిగే ఆనందం మరెక్కడా దొరకదు'' అంది. ఇక ప్రస్తుతం త్రిష..ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె పక్కా మాస్ మసాలా పాత్రలో కనిపించనున్నట్లు చెప్తున్నారు. బాడీ గార్డ్ తర్వాత త్రిష తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం విడదల అయ్యాక ఆమె మళ్లీ తెలుగులో బిజీ అవుతానని భావిస్తోంది.
