రాజమౌళి 'ఈగ' లో వెంకటేష్
Rajamouli ‘Eega’ film completed 80% of shooting.Nani and Samantha are the main lead in ‘Eega’ movie, Kannada actor Sudeep playing another important role in ‘Eega’ film. Hero Venkatesh giving voice over to ‘Eega’ film
రాజమౌళి తాజా చిత్రం ఈగ చిత్రంలో మూడు పాటలు మాత్రమే ఉంటాయని సమాచారం. అలాగే డ్యూరేషన్ కూడా కేవలం గంటన్నర నుంచి రెండు గంటలలోపే ఉండబోతోందని తెలుస్తోంది. ఇక వెంకటేష్ ఈ చిత్రంలో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకి మాటలు రాయటానికి కానూ దర్శక, రచయిత జనార్ధన మహర్షిని తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్ కి గానూ క్రేజీ మోహన్ ని తీసుకున్నారు. ఇక ఈగ చిత్రంలో విలన్ గా కన్నడ నటుడు సుదీప్ చేస్తున్నారు. .సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
‘ఈగ’ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం. ఇప్పటికి ఈ చిత్రంకి 80% షూటింగ్ పార్ట్ పూర్తైంది.
