Why Pawan Kalyan Not Attend Racha
Ram charan clarifies about why pawan not attend Rachcha audio.
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం రచ్చ ఆడియో నిన్న ఆదివారం సాయింత్రం నెక్లెస్ రోడ్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అందరి కళ్లూ పవన్ కళ్యాణ్ కోసం వెతికాయి. అయితే ఆయన ఆ పంక్షన్ కి హాజరు కాలేదు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పంజా ఆడియో పంక్షన్ కి మెగా ఫ్యామిలీ హాజరు కాలేదు. ఈ నేపధ్యంలో ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. అయితే ఈ విషయం గ్రహించిన రామ్ చరణ్ తన ప్రసంగంలో మొదటే ఈ విషయం ప్రస్తావించారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ...''పవర్ స్టార్ గురించి మీరంతా అడుగుతున్నారని తెలుసు. ఈ వేడుకని 4వతేదీనే చేద్దామనుకొన్నాం. కానీ కుదరలేదు. దీంతో షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ రోజు సాయంత్రమే ఫోన్‌చేసి సారి చెప్పి...అభినందనలు చెప్పారు. ఈ కేకలు ఆయనకు అమెరికా దాకా వినిపిస్తాయనుకుంటున్నాను అన్నారు. అలాగే మా బాబాయ్ కి మొదటి సక్సెస్ ఇచ్చిన రెండు సినిమాలు గోకులంలో సీత, సుస్వాగతం లు చేసిన బ్యానర్ లోనే చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇక ప్రస్తుతం పవన్ తన గబ్బర్ సింగ్ షూటింగ్ బిజీలో ఉన్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నారు.
