అబ్బో...రాజమౌళి ఈగ అంత తెలివైందా?
నానీ, సమంత,సుదీప్ ప్రధానపాత్రధారులుగా వారాహి చలనచిత్ర పతాకంపై ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఈగ’. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. దర్శకుడు రాజవౌళి మాట్లాడుతూ... బలవంతుడైన విలన్ బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే చిత్ర కథాంశమని, వినోదం, ఆశ్చర్యం, ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందుతుందని, మార్చి 30న పాటలను, ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మా సినిమాలోని ఈగ చాలా తెలివైంది. ఆ ఈగ తన పగ తీర్చుకునేందుకు ఆసక్తికరమైన దారి ఎంచుకుంటుంది. అది తెరపై చూస్తేనే బావుంటుంది. కీరవాణి అందించిన ఆడియో సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాడు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎస్.రవీందర్, నిర్మాత: సాయి కొర్రపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజవౌళి.
