|

Court Case on Kolaveri Di


రజనీకాంత్ అల్లుడు హీరోగా కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘3’ సినిమా ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేకపోయింది. కోలవెరి – డి పాటతో భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా విజయం మాత్రం సాధించలేకపోయింది. అయితే తాజాగా సినిమాలోని కోలవెరి డి పాటను వెంటనే నిలపివేయాలని కేరళ హైకోర్టులో మాధస్వామి అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.
తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అమ్మాయిలను కుర్రకారు ఈ పాటతో టీజ్ చేస్తున్నారని, ఈ పాట యువతలో హింసను, ఉద్రేకాన్ని కలిగిస్తుంనది ఓ అమెరికా సైకలాజికల్ సంస్థ పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు.  మాదస్వామి కేరళాలోని ఇదుక్కి ప్రాంతానికి చెందినవాడు.  ఆయన 30 గంటల 6 నిమిషాలపాటు ఏకధాటిగా ప్రసంగించి గిన్నిస్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. మరి కోలవెరి పై కోర్టు ఏ తీర్పు ఇస్తుందో ? వేచిచూడాలి.


Posted by Andhra Gossips on 04:05. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips