Nayantara Conditions Apply
‘‘రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదంటే’’ ఇదేనేమో. నయనతార తన సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న ఆనందం ఆమె కండీషన్లు వినేసరికి ఆవిరైపోతుందట. ప్రభుదేవాతో ప్రేమ విఫలం విషయం బహిరంగంగానే ప్రకటించిన నయనతార ఇప్పుడు అర్జంటుగా నాలుగు అవకాశాలు దొరకబుచ్చుకొని డబ్బులు వెనకేసుకోవాలన్న ప్రయత్నంలో పడిపోయారు.
అందుకే నయనతార ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకుంటోంది. అయితే ఇటీవల నయనతార మాజీ ప్రియుడు శింబు తో కలిసి ‘వాళు’ అనే చిత్రంలో నటించాలని చిత్ర నిర్మాత అడిగాడట. అయితూ ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం అడిగిందట నయనతార. అంతే కాదు దాంతో పాటు పలు కండీషన్లు పెట్టిందట. హీరో శింబు తనతో మాట్లాడకూడదట. ఇక పర్సనల్ విషయాలు అసలు మాట్లాడొద్దట. తన వ్యానిటీ వ్యాన్ ఉన్న ప్రాంతానికి రానే రాకూడదట. ఇలా నయనతార కండీషన్లు విన్న నిర్మాతకు కళ్ళు తిరిగాయట. అందుకే ఈ మాజీ ప్రేమికుల మధ్య నలిగి చచ్చేకంటే ఓ కొత్త హీరోయిన్ ను వెదికి పట్టుకోవడం నయమని ఆ ప్రయత్నాల్లో పడిపోయాడట.
