‘ఢమరుకం’ ఆగిపోయిందా?!
నాగార్జున హీరోగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఢమరుకం సినిమా ప్రస్తుత స్థితి ఏంటి? ఇది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలను వారు విడుదల చేయడం లేదు. మరోవైపు నాగార్జున శిరిడీ సాయిబాబా గెటప్ లో బయట కూడా హల్ చల్ చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల క్రితం శ్రీనివాస రెడ్డి కూడా ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో కనిపించి ఆశ్చర్యానికి గురి చేశాడు. మొదట ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని ప్రకటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఆగస్టుకు వాయిదా పడిందనే వార్త కొంత కాలం కిందట వినిపించింది. ఈ చిత్ర రషెస్్ చూసిన నిర్మాతలు సంతృప్తి చెందక కొన్ని సీన్లు రీ షూట్ చే సే ప్రయత్నాల్లో ఉన్నారనేది ఒక వార్త అయితే నిర్మాతలకు, నాగార్జునకు మధ్య విబేధాలు తలెత్తాయని దీంతో ఈ ప్రాజెక్టను ఆయన పట్టించుకోవడం లేదని మరో వార్త షికారు చేస్తున్నాయి. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం నాగార్జున దూరంగా జరుగుతున్నాడట. మొన్నమధ్య నాగార్జున సినిమా రాజన్న ను కూడా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వాళ్లే విడుదల చేశారు. ఆ సినిమాతో వారికి నష్టాలు మిగిలినట్టు తెలుస్తోంది. దడ కూడా కొన్ని ఏరియాల్లో విడుదల చేసి చేతులు కాల్చుకొన్నారు ఇదే నిర్మాతలు. తాజా ఢమరుకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటూ నాగార్జునతో నిర్మాతలు విబేధించారని, అందువల్లనే సినిమా లేటువుతోందనేది మాత్రం విశ్వసనీయమైనదిగానే కనిపిస్తోంది.
