|

I am Not The Super Star : Rajinikanth

His stardom has transcended borders and the fan frenzy Rajinikanth generates is unmatchable but the veteran thespian says that Amitabh Bachchan is the only one who can be called a superstar.

‘కొచ్చడయాన్’ షూటింగ్ కోసం లండన్‌కి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన బస చేసిన బెంట్లే హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ తన దృష్టిలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ మాత్రమే సూపర్‌స్టార్ అని అన్నారు. ‘‘నా వరకు అమితాబే సూపర్‌స్టార్. ఇప్పటికీ ప్రతి సినిమాను మొదటి చిత్రంగానే భావిస్తానని... దర్శకుడు, నిర్మాత ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా ఉంటానని 61 ఏళ్ల రజనీ చెప్పారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్దించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

‘కొచ్చడయాన్’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 13న అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం రజనీకాంత్ ఓ పాట పాడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకునే, ఇతర పాత్రల్లో శోభన, శరత్‌కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటిస్తున్నారు.


Posted by Andhra Gossips on 04:41. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips