Shruti Hassan About Gabbar Singh
Shruti Hassan says..Gabbar Singh will be a Blockbuster.
గత సినిమాల కంటే 'త్రీ'లో చాలా బాగా నటించావు అని అందరూ చెబుతున్నారు. నాకు కావల్సింది అదే. సినిమా సినిమాకీ నాలో మార్పు కనిపించాలి. ఒక్కోమెట్టూ ఎదగడం చాలా ముఖ్యం. నేను కూడా నా నటన పట్ల సంతృప్తిగా ఉన్నా. రాబోయే 'గబ్బర్‌సింగ్'లో మరింత మంచి నటిని చూడొచ్చు''అని హామీ ఇచ్చింది శ్రుతిహాసన్. ఆమె నటించిన 'త్రీ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ తో చేస్తున్న 'గబ్బర్‌సింగ్' చిత్రీకరణ చివర దశలో ఉంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించిది. అలాగే .. నేను ఎక్కడికి వెళ్లినా తమ సొంత మనిషిలా చూసుకొంటున్నారు. సెట్లో వాతావరణం నాకు చాలా సౌకర్యంగా ఉంటోంది. మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తోంది అంది. ఇస శృతిహాసన్ హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోందని, రికార్డులు సృష్టించే చిత్రంగా వుందని అందరూ చెప్పడం సంతోషంగా వుందని తెలిపారు. సంగీతమే హైలెట్‌గా రూపొందిన పాటలు త్వరలో విడుదల చేస్తున్నామని తెలిపారు. హరీష్ శంకర్ ఎస్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, నిర్మాత: బండ్ల గణేష్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.
