Kolaveri was Finally a FLOP
Dhanush's latest 3 film finally marked as Flop.
ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన 'త్రీ' మొన్న శుక్రవారం విడుదలైంది. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్ లో మాత్రం మంచి కలెక్షన్స్ కలెక్టు చేసింది. 'కొలవెరి ఢీ..' అంటూ రెండు, మూడు భాషల్ని పాటలో కలిపి అంతర్జాతీయంగా క్రేజ్ తెచ్చుకున్నా ఈ సినిమాకు ఆ పాట కలిసిరాలేదు. చిత్రానికి ప్రధాన ఆకర్షణ అనిరుధ్ బాణీలు అయినా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కొత్తదనం చూపాడం బాగుంది. అయితే దర్శకురాలిగా పరిచయమయ్యేటప్పుడు ఇటువంటి కథను ఎంచుకోవటం సాహసమే అయినా ఇటువంటి కథల్ని తెరకెక్కించడంలో మరింతగా జాగ్రత్త పడితే మరోలా ఉండేదని విమర్శలు వస్తున్నాయి. ఫస్టాప్ బాగా తీసినా సెకండాఫ్ లో మానసిక రోగం తీసుకు వచ్చి కథను ప్రక్కదారి పట్టించటంతో చాలా డ్రై గా కథనం మారిపోయి బోర్ గా తయారైంది. అయితే ఓపినింగ్స్ బాగా రావటంతచో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నట్టికుమార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక కొలవెరి డీ.. అంటూ పాట వేలం వెర్రిగా ఆకట్టుకున్నా... చిత్రంలో ఆ పాటకు అంత సీన్ లేకుండా పోవటం కూడా బాగా నిరాశ పరిచిన అంశం.
