Secret Surgery For Nagarjuna?
వయస్సు యాభైఏళ్లు పైబడినా ఆ ఛాయలు ఏమాత్రం కనిపించకుండా ఇప్పటికీ నవనవలాడుతుంటాడు మన టాలీవుడ్ మన్మధుడు ‘నాగార్జున’. నాగార్జున తన గ్లామర్ తగ్గకుండా ఫుడ్ విషయంలో, వ్యాయామం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు సీక్రెట్‌గా పలు సర్జరీలు చేయించుకున్నాడనే గాసిప్స్ ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు సంబంధించి ఇలాంటి వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నాగార్జునకు కంటి సర్జరీ జరిగిందని ఆ వార్తల సారాంశం. ఇటీవల రాజమౌళి ‘ఈగ’ ఆడియో ఫంక్షన్‌కు హాజరైన నాగ్ ఐడ్రాప్స్ వేసుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. అయితే ఐడ్రాప్స్ వేసుకున్నంత మాత్రాన సర్జరీ జరిగిందని అనుకోవడం సరికాదని మరికొందరంటున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే...నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘షిరిడి సాయి’ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘అన్నమయ్య’, ‘శ్రీరామ దాసు’ లాంటి భక్తిరస చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో భక్తుడిగా కనిపించిన నాగ్ ఈ చిత్రంలో తొలిసారిగా దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. మరో వైపు నాగార్జున శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’ విడుదలకు సిద్ధం అవుతోంది.
