STRIKE Effect on Bindu Madhavi
'ఆవకాయ బిర్యాని' చిత్రంతో పరిచయమైన బిందు మాధవికి ఆ తర్వాత బంపర్ ఆఫర్ తో బ్రేక్ వస్తుందని భావించింది.అయితే ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ చెప్పుకోదగిన మలుపు ఏమీ తిరగలేదు.తెలుగు అమ్మాయి కావటమే మైనస్ గా అయిందే ఏమో కానీ ఆమె ఖాళీ పడిపోయింది. దాంతో తమిళ పరిశ్రమను ఆశ్రయించింది. అయితే అక్కడా ఆమెకు సమ్మె రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమిళ నిర్మాతల మండలి, ఫెప్సీకి మధ్య వేతనాల సమస్యతో కోలీపుడ్ సంక్షోభంలో పడింది. ఆత్మాభిమానం అంటూ నిర్మాతల మండలి, న్యాయ పోరాటం అంటూ ఫెప్సీ పంతాలకు పోవడంతో చిత్ర పరిశ్రమలో అనిశ్ఛితి ఏర్పడింది. దీంతో పలువురు పలు అవకాశాలను కోల్పోతున్నారు. ఈ ఎఫెక్ట్ నటి బిందుమాధవిపైనా పడింది. ఆమె మంచి అవకాశాన్ని వదులు కోవలసి వచ్చింది. వెప్పం, కళుగు చిత్రాల హీరోయిన్ బిందుమాధవి కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఈమెకు శ్రీను రామస్వామి దర్శకత్వంలో నీర్ పార్వై చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. అయితే ఫెప్సీ, నిర్మాతల మండలి మధ్య వివాదం కారణంగా షూటింగ్‌లు వాయిదా పడడంతో పాటు మే రెండవ తేదీ వరకు నూతన చిత్రాలు ప్రారంభించరాదని నిర్మాతల మండలి తీర్మానం చేయడంతో నీర్ పార్వై చిత్రం షూటింగ్ వాయిదా పడింది. దీంతో బిందుమాధవికి కాల్‌షీట్స్ సమస్య ఏర్పడటంతో ఆమె నీర్ పార్వై చిత్రాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇప్పుడీ చిత్రంలో బిందు మాధవి పాత్రను నటి సునైనా దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఆమె పొగ అనే చిత్రం చేస్తోంది. సిద్దార్దతో ఓయ్ చిత్రం డైరక్ట్ చేసిన ఆనంద రంగా ఇప్పుడో చిత్రం నిర్మిస్తున్నారు. పొగ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం 4D హర్రర్ ఫిలిం అని తెలుస్తోంది. మార్తాండ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం భయపెట్టే సైక్లాజికల్ హర్రర్ అని చెప్తున్నారు.
