డబ్బు కోసం ఎంతకైనా తెగించే నమిత!
Voluptuous bombshell Namitha will soon be seen in a dubbed film which has been titled ‘Midatha’.
నమిత ప్రధాన పాత్రలో నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘మిడత’ పేరుతో అనువాదం కాబోతోంది. కె. రాజేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మి దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్ హీరోగా నటిస్తుండగా రగస్య సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం గురించి నిర్మాత వెల్లడిస్తూ...‘‘మిడతలెప్పుడూ దీపం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇందులో నమిత పాత్ర కూడా అలాగే ఉంటుంది. డబ్బు చుట్టూ తిరుగుతూ డబ్బు కోసం ఎంతకైనా తెగించే పాత్ర ఆమెది. ఈ చిత్రంలో ఆమె ఆల్ట్రా మోడల్ పాత్రలో అందంగా కనిపిస్తారు. సినిమా మొత్తం గ్లామరస్ గా ఉంటుంది. శ్రీరామ్ పాత్ర చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. కథ, కథనాలు, పాటలు, వినోదం, బావోద్వేగాలు క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. నమిత అభిమానులను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అనువాదన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మిక్సింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే ఆడియో, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
నాజర్, వివేక్, రాధరవి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యతీష్, మర్పణ: నైనాల హైమవతి.
