Samantha as Weapons Supplier
Samantha has turned into a weapons supplier in ace director S.S.Rajamouli’s graphical magnum opus ‘Eega’.
సమంత వెపన్ సప్లయర్‌గా మారడం ఏమిటి? అని ఆశ్చర్య పోతున్నారా...అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. సమంత ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఈగ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో నాని హీరోగా, సుదీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కథ ప్రకారం హీరో సినిమా మొదలైన తొలి అరగంటలోపే విలన్ చేతిలో చని పోతాడని...పగ తీర్చుకోవడానికి ఈగగా మారిన హీరో విలన్‌ను చంపే ప్రయత్నంలో ఉంటాడని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలో హీరో చేతిలో ప్రత్యేకమైన ఆయుధం ఉంటాయి. అదే తరహాలో ఈగ చేతిలో సూదిని ఆయుధంగా పెట్టాడు. ఇందులో ఈగకు సూక్షమైన సూది సప్లయ్ చేస్తుందట సమంత.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో ఒకే సారి అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ట్రై చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం, భారీ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల కాబోతోంది.
