|

Sharuk Khan Wants to Work with Vidya Baalan


Bollywood superstar Shahrukh Khan says he is looking forward to working with Vidya Balan.

ఆమె కోసం ఆశ పడుతున్న స్టార్ హీరో


బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటి విద్యాబాలన్ పై ఆశ చూపుతున్నాడు. తెరపై ఆమెతో కలిసి నటించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇటీవల విడుదలైన విద్యా బాలన్ తాజా సినిమా ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో విద్య నటనను చూసి ముగ్దుడై పోయిన షాురుఖ్ ఇటీవల ఓ కార్యక్రమంలో తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘ఆమె అద్భుతమైన నటి, ఇటీవలే డర్టీ పిక్చర్ సినిమా చూశాను, అంతకు ముందు విద్యా నటించిన ‘ఇష్కియా’ చిత్రం, ‘ఫా’ చిత్రాలు డీవీడీలో చూశాను, ఎంతో కష్ట పడి, అంకిత భావంతో పని చేసింది. అందుకే విద్యాతో కలిసి నటించాలనే కోరిక ఎక్కువైంది’ అంటూ విలేకరులతో అన్నాడు షారుఖ్. 

ప్రస్తుతం షారుఖ్ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో చేసే సినిమాపై దృష్టి సారించాడు. ఈ చిత్రంలో ఆయన కత్రినా కైఫ్ తో జతకట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సంవత్సరం ఈ చిత్రంతో పాటు షారుఖ్ నటించిన Koochie Koochie Hota Hain అనే చిత్రం కూడా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. 

డర్టీ పిక్చర్ భారీ విజయంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన చేరిన విద్య బాలన్ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె కహాని చిత్రంలో నటిస్తోంది. మార్చి 9న కహాని చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు విద్యా బాలన్ నటించబోయే చాంద్ భాయ్ చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.


Posted by Andhra Gossips on 20:43. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips