Fire Accident in Chandrabose House
Fire accident in lyricist Chandra Bose house on monday.
సినీ గేయరచయిత చంద్రబోస్ ఇంట్లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆయన ఇంట్లోని మొదటి అంతస్తులో మంటలు అంటుకుని బట్టలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వందల కొద్దీ ఆడియో క్యాసెట్లు, సీడీలు ఆగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదాన్ని గ్రహించి అంతా బయకు పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు.
హైదారాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలోని అంజలీ గార్డెన్స్ లోని చంద్రబోస్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో చంద్రబోస్ మామ చాంద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటున్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబోస్ నాగార్జున హీరోగా రూపొందుతున్న ‘షిరిడి సాయి’ చిత్రంతో పాటు, పలు సినిమాలకు పాటల రచయితగా పని చేస్తున్నారు.
