Sonu Sood as Dawood Ibrahim
అరుంధతి, దూకుడు, పలు తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రల్లో అలరించిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రలో కనిపించబోతున్నాడు. ‘షూటౌట్ ఎట్ వాడాలా’ అనే హిందీ చిత్రంలో సోనూ సూద్ ఈ పాత్ర చేయబోతున్నాడు. ఇంతకు ముందు వివేక్ ఒబెరాయ్ అండర్ వరల్డ్ డాన్ పాత్ర చేయడానికి సైన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అతను తప్పుకోవడంతో ఆ అవకాశం సోను సూద్‌కి దక్కింది. ఇంకా ఈ చిత్రంలో జాన్ అబ్రహం గ్యాంగ్ స్టర్ మాన్యా సర్వే పాత్రలో, అనిల్ కపూర్ ఎసిపి భగవాన్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ విషయమై సోను సూద్ మాట్లాడుతూ...ఈ పాత్ర చేయడం ఎంతో ఎగ్జైటెడ్ గా ఉంది. మార్చిలో షూటింగ్ మొదలువుతుందని చెప్పుకొచ్చారు. పాత్ర చేయడానికి ముందు దావూద్ గురించిన విషయాలు తెసుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ చిత్రానికి సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2007లో వచ్చిన ‘షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా’ చిత్రానికి ఇది రీమేక్. ఈచిత్రంలో ఇంకా కంగన రనౌత్, తుషార్ కపూర్, రోనిత్ రాయ్, మనోజ్ బాజ్ పాయ్ తదితరులు నటిస్తున్నారు.
