Salman Khan and Sharukh Khan are Neighbours Now
Salman Khan has bought Rs. 39 crore Triplex flat at Bandra Bandstand and the house is quite close to Shahrukh Khan’s residence Mannat.
బాలీవుడ్ మాస్ హీరో,కండల వీరుడు ఇప్పుడు ప్రతీ విషయంలోనూ షారూఖ్ తో పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే సల్మాన్ తాజాగా ఓ ట్రిపులెక్స్ ప్లాట్ ని కొనుగోలు చేసాడు. అదీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఇంటి ప్రక్కనే కావటం విశేషం. వివరాల్లోకి వెళితే.. కింగ్‌ఖాన్ షారూఖ్ ముంబై బాంద్రాలోని మన్నత్ బంగ్లాలో ఉంటున్నారు. అయితే ఆ బంగ్లా పక్కనే ఉన్న ‘ది అడ్రస్’ భవనంలో సల్మాన్‌ఖాన్ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 28 అంతస్తులున్న ఈ బంగ్లాలో రూ. 39 కోట్లు వెచ్చించి సల్మాన్ ఓ ట్రిపులెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్ తండ్రి సలీంఖాన్ రూ.1.64 కోట్లు స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు చెప్పారు.
సల్మాన్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఫ్లాట్ ఉండడం గమనార్హం. కత్రినాకైఫ్ విషయంలో గొడవపడి వైరం పెంచుకున్న వీరిద్దరు అన్నింటా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అదే పట్టుదలతో సల్మాన్‌ఖాన్ ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏక్ ధా టైగర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
