22:31 | Posted by Andhra Gossips
బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెలుతున్న హీరోయిన్ కరీనా కపూర్ రేంజ్ మామూలు నిర్మాతలకు అందనంత ఎత్తుకు పోయింది. కుర్రకారుకు పిచ్చెక్కించే ఆమె అందంతో పాటు, కరీనా నటించిన త్రీ ఇడియట్స్, బాడీగార్డ్, రా.వన్ సినిమాలు వంద కోట్ల బిజినెస్ క్రాస్ కావడంతో కరీనాకు ఎక్కడలేని డిమాండ్ వచ్చి పడింది. ప్రస్తుతం కరీనా కావాలంటే రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో వాటా కూడా సమర్పించు కోవాల్సిందే. ఈ లెక్కన కరీనాకు ఒక సినిమాకు ఎంత కాదన్నా రూ. 15 కోట్ల వరకు ముట్టజెప్పుకోవాల్సిందే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు.
స్రస్తుతం కరీనా కపూర్ మాధుర్ బండార్కర్ రూపొందిస్తున్న ‘హీరోయిన్’ సినిమాతో పాటు, తన లవర్ సైప్ అలీఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తానే హీరోగా రూపొందిస్తున్న‘ఏజెంట్ వినోద్’ చిత్రంలో నటిస్తోంది. మాధుర్ సినిమాకు ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ సంగతి పక్కన పెడితే...తన వాడు, తనకు కాబోయే వాడు అయిన సైఫ్ దగ్గర కరీనా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనే విషయం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.