|

Shahrukh Celebrates his Birthday on Flight

The most adorable and the most popular actor of Bollywood Shahrukh Khan has turned a year older on 2nd November. Khan celebrated his 46th birthday on a flight when he was on his way to Mumbai to be with his family. The clock had struck 12 and the whole crew and the passengers on the flight had sung happy birthday for the star on his birthday.


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ పుట్టిన రోజు ఇవాళ. దీనితో 46 వ వసంతం లోకి షారూక్ అడుగిడారు. షారుక్ పుట్టిన రోజును వెరైటీగా విమానంలో ప్రయాణీకుల మధ్య జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకులు జరుపుకునేందుకు ముంబైకి బయల్థేరిన షారుఖ్ అర్థరాత్రి 12 దాటేసరికి విమాన ప్రయాణంలో ఉండటమే ఇందుకు కారణం. అనంతరం ఫ్యాన్స్ అభినందనలను అందుకున్నారు. ఆయనకు ఒక్క ఇండియన్ కమ్యునిటీనే కాదు మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, మరియూ రష్యాలోనూ ఎంతోమంది అభిమానులున్నారు. 

ఇప్పటివరకూ సుమారు 70 చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ హీరో 90 వ దశకం మధ్యనుండి ఇప్పటికీ లీడింగ్ హీరోగా కొనసాగుతున్నారు. అతని కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. షారూక్ సినిమాకు విదేశీ బాక్స్ ఆఫీసుల వద్దా భారీ మార్కెట్ ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆయన్ను డార్లింగ్ గా భావిస్తారు. 2005 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు పొందిన ఈ మహా నటుడి ఖాతాలో ఇంకా ఎన్నో అవార్డులు ఉన్నాయి. 14 సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన దక్కించుకున్నారు.

‘దీవాన్’ చిత్రం తో షారూక్ బాలీవుడ్ లో రంగప్రవేశం చేసినప్పటికీ, ‘దార్’ ‘బాజిగర్’ చిత్రాలు ఆయన్ను లైం లైట్ లోకి తీసుకు వచ్చాయి. అనంతరం ఆయన ‘కరణ్ అర్జున్’ ‘దిల్ వాలే దిల్హునియా లేజాఎంగె’ ‘కుచ్ కుచ్ హోతాహై’ ‘పర్దేస్’ ఇంకా ‘దిల్ తో పాగల్ హై’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఇక వెనుదిరిగి చూడలేదు. రీసెంట్ గా విడుదలైన చిత్రం రా.వన్ కూడా బాక్స్ ఆఫీసులో వారాంతానికి 170కోట్లు వసూళ్ళు వర్షం కురిపించడంతో కింగ్ ఖాన్ హ్యాపీహ్యాపీగా ఉన్నారు. కుటుంభం పట్ల అంకిత భావంతో ఉండే షారూక్ కు అతని భార్య గౌరీ అన్ని విధాల సహకారం అందిస్తారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కు దట్స్ తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు …


Posted by Andhra Gossips on 05:27. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips