Katrina Kaif Latest is the Highest Demand New Year Girl
The A-listers like Katrina Kaif, Kareena Kapoor and Priyanka Chopra charge anything between Rs 1.2 to Rs 2 crore for a New Year's Eve performance.
న్యూ ఇయిర్ వస్తోందంటే హీరోయిన్స్ కి అందునా ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ కి భలే డిమాండ్. వారిలో ఎక్కువ డిమాండ్ సంపాదించి,ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మలు ముగ్గురే. వాళ్లే కత్రినాకైఫ్,కరీనాకపూర్,ప్రియాంకా చోప్రా. ముందుగా వీరిలో కత్రినాకైఫ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆమెను రెండు కోట్లు దాకా ఇచ్చేందుకు క్లబ్ నిర్వాహకులు వెంటబడుతున్నట్లు సమాచారం. అయితే ఆమె సూపర్ హిట్ ఐటం సాంగ్ షీలా కీ జవానీని స్టేజ్ పై డాన్స్ చేయాలి. ఈ కార్యక్రమంలో ఆమె కేవలం 15 నిమిషాలు మాత్రమే వుంటుంది. అయితే ఆమెకు ఆ రేటు ఇవ్వటానకి విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటివరకూ కత్రినా ఎవరకీ హామీ ఇవ్వలేదు. ఎక్కువ ఎవరు ఆఫర్ చేస్తే వారితో కమిటవ్వటానికి ఆమె వెయిట్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఆ తర్వాత స్ధానం కరీనా కపూర్ పొందింది. ఆమె కూడా రాత్రి మూడు పాటలు డాన్స్ చేయటానికి మూడు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ కావటంతో ఆమె ఓకే అంటే ఆమె పేరు చెప్పి ఆ రాత్రి రేటు విపరీతంగా పెంచవచ్చునని క్లబ్ నిర్వాహకులు ఎంతైనా ఇవ్వటానికి సిద్దపడుతున్నారు. ఆ తర్వాత స్ధానం ప్రియాంక చోప్రాది. ఆమె కు కోటిన్నర దాకా ఇవ్వటానికి ముందుకొస్తున్నారు. అయితే ఈ ముగ్గురూ ఇంకా ఏ హోటల్ వారికీ సైన్ చెయ్యలేదని,ఎవ్వరు ఎక్కువ ఇస్తే వారితో వెళ్లటానకి సిద్దంగా ఉన్నారు. మరి ఎవరా అదృష్టవంతులో చూడాల్సిందే.
