South Actress List Waiting For Next Offers
‘డాన్ శీను’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీయకు.. ఆ సినిమా హిట్టయినా సరే తెలుగులో మరో అవకాశం రాలేదు. అలాగే అదే సినిమా ద్వారా పరిచయం అయిన అంజనా సుఖాని కి కూడా ఒక్క ఆఫరూ రాలేదు. అలాగే రవితేజ ‘మిరపకాయ్’హీరోయిన్ రిచా గంగోపాధ్యాయకు తెలుగులో మరో ఆఫర్ రాలేదు. వీరికి తోడుగా ‘ప్రేమ కావాలి’చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఇషా చావ్లాకు ఇప్పటివరకు రెండో చాన్స్ దొరకలేదు.
అల్లరి నరేష్ ‘అహ నా పెళ్లంట’హీరోయిన్ రీతూ బర్మేచా, ‘సీమటపాకాయ్’హీరోయిన్ పూర్ణ కీ మరో ఛాన్స్ దక్కలేదు. వీరు నటించిన సినిమాలు ఆడినప్పటికీ వీరిమూలంగా ఆడాయన్న పేరు తెచ్చుకోకపోవటంతో వీరికి మరో ఆఫర్ వరించలేదు.వీరంతా మరో మంచి ఆఫర్ వస్తుంది..టాలీవుడ్ లో సెటిల్ కావచ్చుని నిర్మాతల ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
