Mahesh Babu with Love Stories Director
పవన్ కళ్యాణ్‌తో తొలి ప్రేమ, ప్రభాస్‌తో డార్లింగ్ లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన దర్శకుడు కరుణాకరన్ త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటి నుండో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కథ కూడా ఓకే అయిందనీ, మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తాడని సమాచారం. ప్రేమకథ చుట్టూ సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక కరుణాకరన్ ప్రస్తుతం రామ్, తమన్నా జంటగా 'ఎందుకంటే... ప్రేమంట' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక మహేష్ బాబు-కరుణాకరన్ కాంబినేషన్ మొదలయ్యే అవకాశం ఉంది.
